
ముస్తాబాద్ డిసెంబర్ 01 భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల కార్యవర్గ సమావేశం నామాపూర్ గ్రామం యాదవ సంఘంలో నిర్వహించడం జరిగిందని దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ గంగాడి మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, శీలం రాజు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మేరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. నేటి నుండి సిరిసిల్ల నియోజకవర్గంలో పల్లె గోస -బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈబైక్ ర్యాలీ ముస్తాబాద్ మండలం నుండి ప్రారంభం కానున్నదని ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమా హాజరవుతున్నారు. ఈకార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటలకు బైక్ ర్యాలీ తుర్కపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మండలంలో అన్ని గ్రామాల గుండా ప్రారంభమవుతుందని బీజేపీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కార్యవర్గ సమావేశం హాజరుకానున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంజీవ్, మండల ప్రధాన కార్యదర్శి లు కోలా కృష్ణ, క్రాంతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుడుకల జనార్ధన్, టౌన్ అధ్యక్షుడు మహేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వరి వెంకటేష్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి, పిఎసిఎస్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్ శ్రీనివాసరావు, తాండ్ర రాంగోపాల్, మీసా శంకర్ ,నామాపూర్ ఉప సర్పంచ్ తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు ఏదునూరి గోపి, బెదురు ప్రశాంత్ , అజయ్ , శ్రీశైలం,చిగురు వెంకన్న, పప్పుల శ్రీకాంత్, బోయిని వేణు, ఆకారపు వేణు, మహేష్, గణేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.