ప్రాంతీయం

శివకేశవ ఆలయంవద్ద మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి..

362 Views
 ముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి):  ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపారు. మహిళా మణులు ఆనందోత్సవాల మధ్యలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలో విజేతలులుగా నిలిచిన మహిళలకు నాలుగు బహుమతులతో పాటు ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ ఎలసాని దేవయ్య, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యుఐ నాయకులు కార్యకర్తలు, ముగ్గుల పోటీకి ప్రోత్సహించిన తాళ్ళ విజయ్ రెడ్డి, మహిళ మణులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7