ప్రాంతీయం

ఆర్యవైశ్య మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ 

44 Views

ఆర్యవైశ్య మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లా గజ్వేల్  డిసెంబర్ 28

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని కిరాణా అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆర్యవైశ్య మహాసభ సమావేశం గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జగ్గయ్య  శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి, ఆర్యవైశ్య మహాసభ బాధ్యులకు నియామక పత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, గంప శ్రీనివాస్, అయిత రత్నాకర్, కాసం నవీన్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని, ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి మన హక్కుల సాధన కోసం పోరాడాలని, నూతనంగా నియామకమైన ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో, ఆర్యవైశ్య మహాసభ యూత్ విభాగం, మహిళా విభాగం, ఆర్యవైశ్య నాయకులు సిద్ధి బిక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య, మరుమాముల ఓంకార్, అయిత సత్యనారాయణ, జగ్గయ్య శేఖర్, ఎర్రం శ్రీనివాస్, గంగిశెట్టి నాగమణి వెంకటేశం, గౌరీ శంకర్, కాశీనాథ్, ఉమేష్, శ్రీహరి, జిల్లా నాయకులు మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్