(తిమ్మాపూర్ జనవరి 14)
తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో ఇటీవల D4 కెనాల్ కాలువ గండిపడి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు, నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ వెంటనే స్పందించి 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యన్ని పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా రావుల రమేష్ ను మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ తో పాటు బాధిత కుటుంబాలు గ్రామ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నార్ల అశోక్,నాంపల్లి శంకర్, పెట్టం రమేష్, బీనపల్లి రాజయ్య, గుంటి కిష్టయ్య, బౌత్ గంగాధర్, రావుల మల్లేశం, అసోద అంజయ్య, ఉప్పులేటి తిరుపతి, సుధగోని శ్రావణ్ కుమార్ ,పార్నంది సంపత్, పార్నంది స్వామి, బొజ్జ శ్రీనివాస్, బూడిద కిషోర్, బూడిద రమేష్, బీనపల్లి బాలయ్య, సుధగోని సదయ్య, దరిపల్లి వేణు కుమార్, బీణపల్లి సంపత్,నాంపల్లి శ్రీకాంత్, బోయిని శ్రీకాంత్, అశోద సాగర్,పార్నంది పోచమల్లు, బుర్ర శ్రీనివాస్, మాచర్ల నర్శయ్య,ఆశోద సాయి కృష్ణ, గోదారి నాగేంద్ర,బూడిద రంజిత్, కామెరా బొందయ్య తదితరులు పాల్గొన్నారు..