(తిమ్మాపూర్ జనవరి 14)
సంక్రాంతి పండుగ సందర్భంగా తిమ్మాపూర్ మండలం గోల్లపల్లి గ్రామంలో క్రీడా ఫోటీలు నిర్వహించారు..
చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా నాలుగు టీములుగా ఏర్పడి ఉత్సాహంగా క్రికెట్ ఆడరు, మొదటి మ్యాచ్లో గెలిచిన జట్టు,రెండో మ్యాచ్లో గెలిచిన జట్టు పైనల్లో పోటీ పడగా హోరాహోరిగా సాగిన పైనల్ మ్యాచ్ లో కర్ర మణికంఠ టీం విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు, ఓడిన జట్టుకు రన్నర్ కప్పుతో పాటు నగదు ప్రోత్సాహాన్ని గొల్లపల్లి మాజీ సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య యువకులను ఉత్తేజ పరచడం కోసం బహుమతులు ప్రధానం చేశారు. మరి కొంతమంది గ్రామ సీనియర్ క్రీడాకారులు కానుగంటి సత్యనారాయణ రెడ్డి (మాజీ ఉపసర్పంచ్) పింగళి నరేందర్ రెడ్డి, వెన్నం చంద్రశేఖర్ రెడ్డి, బుట్ల శ్రీనివాస్, కానుగంటి మధుకర్ రెడ్డి,కొమ్మెర సతీష్ రెడ్డి, యువకులను ఉత్తేజ పరచడం కోసం ప్రైజ్ మనీ గా నగదును అందజేశారు. సిక్స్ కొట్టిన బ్యాట్ మ్యాన్లకు జంగా రవీందర్ రెడ్డి నగదు ప్రధానం చేశారు.
క్రికెట్ మ్యాచ్ లను చూడటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఆసక్తిగా తిలకించారు..