ఎల్లారెడ్డి పేట లో చీటీ వాసుదేవ రావు స్మారక క్రికెట్ పోటీలు
11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు
జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, పోలీసులు, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఆడడానికి అర్హులని తెలియజేశారు. 11వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలియజేశారు, ఈ ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు మానసిక ఉల్లాసం కోసం స్నేహపూర్వకంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు, ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టుకు 5000 రూపాయల నగదుతో పాటు షిల్డ్. రెండవ జట్టుకు మూడువేల రూపాయల నగదు తో పాటు షీల్డ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు, మ్యాన్ అఫ్ ద మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ఆ ఫ్ ద సిరీస్, ఇవ్వబడుతుంది, ఈ పోటీల్లో పాల్గొనే వారు తమ టీం పేర్లు నమోదు చేసుకోవడానికి ఫోన్:9505635451,9505635451,9550241485, నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలియజేశారు,గెలుపు ఓటమిలను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి..జడ్పీటిసి తండ్రి వాసుదేవరావు జ్ఞాపకార్థం 11న ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ఎల్లారెడ్డిపేట లో నిర్వహిస్తున్నామని
జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు
