Breaking News

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు* 

130 Views

*కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు*

 

మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరూ ఆగస్టు 1న ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సంజీవరావు 1983లో చెన్నూరు నుంచి అప్పటి రాష్ట్రీయ సంజయ్‌ విచార మంచ్‌ (మేనకా గాంధీ) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో అప్పటి ప్రభుత్వం రద్దు కావడంతో రెండేళ్లకే పదవిని కోల్పోయారు. అనంతరం కాంగ్రె్‌సలో చేరారు. కాగా, అమరాజుల శ్రీదేవి 2004లో బెల్లంపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *