ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

122 Views

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో 77 వ గణతంత్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిష్కరించిన ఈ పవిత్ర రోజున, రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పునరంకితమవుదాం..! అని ప్రజలందరికీ,పార్టీ శ్రేణులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ,బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ,బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ జెల్ల ప్రభాకర్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కెరవేణి పోచయ్య,వార్డు సభ్యులు మరియు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,బోనగం రమేష్,బోనగిరి సాయి సింధు,ఎలిగే సతీష్,రావుల లక్ష్మీ, దేవస్థాన కమిటీ డైరెక్టర్లు దోనే శ్యామ్,గుబిరే చంద్రం, బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,బోనాల మల్లేశం, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, రొడ్డ మల్లేశం, పర్ష సంతోష్, ఎస్కిల్ల ఐలయ్య,కొండ్ల వెంకటేశం,పుర్మ నారాయణ రెడ్డి, అడుకని నర్సింగరావు,గుండని ఎల్లయ్య, బోనగిరి శ్రీనివాస్, జంగిటి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *