యువత వ్యాపారంలో రాణించాలి — గాడిపల్లి భాస్కర్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 18
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి పక్కన చాయ్ బంక్ హోటల్ వద్ద ఇటీవల నూతనంగా ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ ను బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ సందర్శించి వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ యజమాని బత్తిని నరేష్ కుటుంబ సభ్యులను అభినందించారు, అనంతరం గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ యువత వ్యాపారంలో రాణించి స్వశక్తితో ముందుకు వెళ్లాలని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్ వినియోగదారుల మన్నన పొందే విధంగా స్వచ్ఛమైన వస్తువులతో, రుచికరమైన టిఫిన్స్ సరసమైన ధరలకు అందజేసి, మంచి గుర్తింపు పొందాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, నాయకులు వెంకటేశ్వర్లు, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు





