ప్రాంతీయం

బలగం విడిచిన మొగిలయ్య

49 Views

 బలగం సినిమా జానపద కళాకారుడు మొగిలయ్య మృతి

వరంగల్ డిసెంబర్ 19

బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య గ‌త కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్దిరోజులుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటున్న క్రమంలో మృతి చెందాడు. జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన కుటుంబ నేపథ్యం సినిమా బలగం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అంద‌రినీ ఏడిపించిన విష‌యం తెలిసిందే. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు పాడిన ఈ పాట ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను కన్నీళ్లు పెట్టించింది.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్