Breaking News విద్య

పెద్దింటి పెళ్ళికి ఆర్థిక సహాయం..

173 Views

(తిమ్మాపూర్ డిసెంబర్ 17)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్
ధ్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, తాళ్లపల్లి ప్రశాంత్ గౌడ్ ద్వారా 3000 మొత్తం 32 వేల రూపాయలు సేకరించి పెళ్లి సామాగ్రిని తానే స్వయంగా కొని హైదర్ కుటుంబానికి అందజేశారు.

తన కూతురు వివాహానికి ఆదుకున్న దాతలకు, దాతల ద్వారా సహాయానికి పరోక్షంగా కృషి చేసిన తాజా మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ కి హదర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ బండారి రమేష్ గౌడ్,యువజన కాంగ్రెస్ నాయకుడు ఆషీక్ పాషా, బుడిగే సంపత్ గౌడ్,ఎండి సర్వర్ పాషా,మావురపు రమేష్, హైదర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్