
దౌల్తాబాద్: మండల పరిధిలోని మాచిన్ పల్లి మధిర గ్రామమైన శేరిల్ల లో చిరుత పులి మంగళవారం రాత్రి లేగ దూడ పై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రైతు శివ రాజయ్య బుధవారం తెల్లవారుజామున తమ పంటపొలాల వద్దకు వెళ్లారు. దూడ మృతి చెంది ఉండగా ఈ విషయాన్ని గ్రామస్తులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ కె అహ్మద్ హుస్సేన్ ఘటన స్థలాన్ని సందర్శించారు. చనిపోయిన లేగ దూడ పరిసర ప్రాంతాల ఆధారంగా దూడపై చిరుత పులి దాడి చేసినట్లు గుర్తించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. మండల పశు వైద్యాధికారి రాజేందర్ రెడ్డి లేగదూడకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.




