ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 16, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్వామి
వివేకానంద విగ్రహంవద్ద భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలు కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు తదితరులు కనేమేని చక్రధర్ రెడ్డికి బీజేపీ ముస్తాబాద్ మండలశాఖ ఆధ్వర్యంలోఇతోధికంగా శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో కస్తూరి కార్తీక్ రెడ్డి, సంతోష్ రెడ్డి, గోలకృష్ణ గౌడ్, మెంగని మహేందర్, మీసా శంకర్, మీసా సంజీవ్, కుడుకల జనార్ధన్, పప్పుల శ్రీకాంత్, ఒరగంటి సత్యం, బండి శ్రీకాంత్, జిల్లెల్ల ఉపేందర్ గౌడ్త తదితరులు పాల్గొన్నారు.
