ఎల్లారెడ్డి పేట చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన దూసరాజేశం అనిత కూతురు దూస పూజ జన్మదినము సందర్భంగా గంభీరావుపేటలోమల్లు గారి నర్సాగౌడ్ నిర్వహిస్తున్న అనాధ వృద్ధాశ్రమంలోనీ వృద్ధుల భోజన సౌకర్యం కే అర క్వింటాల్ బియ్యం ,నిత్యవసర సరుకుల తో పాటు 6వేల నగదును పూజ తల్లి దండ్రులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దూస పూజ , చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
