- మెదక్ జిల్లా చేగుంట మండలం బుధవారం రోజు చందాయిపేట గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికుడు కొత్త సత్యనారాయణ మరణించడంతో అతని కుటుంబ సభ్యులను ఓదార్చి, మనో ధైర్యాన్ని చెప్పి గ్రామపంచాయతీ తరఫున స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం 10.000/- రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, సెక్రెటరీ కృష్ణ, వార్డు సభ్యులు రమ్యరవి, నాగలక్ష్మి కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.




