ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ బరిలో బెస్త నరేష్
అవసరమున్న చోట సబ్ స్టేషన్లు నిర్మిస్తాం..
రైతులకు మరియు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను…
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం డిసెంబర్ లో జరిగే సెస్ ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నరేష్ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు, ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు మరియు గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరంతరం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విద్యుత్ సమస్యలున్న గ్రామాలలో అవసరమున్నచోట సబ్ స్టేషన్ లు నిర్మిస్తామని తెలిపారు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేద ప్రజలను ఆదుకుంటున్న బెస్త నరేష్ ను గెలిపించాలని కోరుకుంటున్నారు*
