ప్రాంతీయం

నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ డైరెక్టర్లను సన్మానించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు: కళ్యాణ్ కర్ నర్సింగరావు.

117 Views

నూతనంగా ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి కూరాకుల సాయి, ఏల వెంకట్, లక్ష్మణ్ ఎన్నికైనందుకు గజ్వేల్ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు నర్సింగరావు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికి పదవులు ఇచ్చి సముచిత స్థానం కలిపిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది అన్నారు..టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు విరివిరిగా ప్రజల్లోకి తీసికెళ్దాం అని అన్నారు..వ్యవసాయ రంగంలో తెరాస ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకోచిందని రానున్న రోజుల్లో తెరాస పార్టీని మరింత బలపర్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదురులేని పార్టీగా నిలబెడుదాం అని అన్నారు..
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు సంగాపురం ఎల్లం, కార్మిక సంఘం అధ్యక్షులు అసా, 1 వార్డ్ అధ్యక్షులు బాకీ స్వామి, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకట సాయి, షరీఫ్, నర్సింలు, శంకర్, నాగరాజు, రాములు, పాములపర్తి స్వామి, ఎక్కలదేవి కనకయ్య యాదవ్, పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found