-మాతృ దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేసిన మహానుభావుడు
-ప్రపంచం గర్వించదగ్గ గొప్ప శాస్త్రజ్గునుడు
భారత మాజీ ప్రధాని, భారతరత్న అబ్దుల్ కలాం 93వ జయంతి సందర్బంగా ఆవాలతో అబ్దుల్ కలాం చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జననం ఓ సాధారణమైనదే కావొచ్చు
కానీ మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేదిగా ఉండాలని ఆయన చెప్పిన మాట మరువొద్దన్నారు. ప్రపంచం గర్వించదగిన శాస్త్రజ్ఞుడు, యువతకు మార్గనిర్దేశకుడు. జీవితాంతం దేశ ప్రతిష్ఠ కోసం తపించి అసమాన దేశభక్తుడు. భారత మాజీ ప్రథమ పౌరుడు, భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు.
