భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బియ్యం గింజలను ఉపయోగించి అంబేద్కర్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం అంబేద్కర్ అన్నారు. పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని నమ్మి ఆ దిశగా జాతి నడిపించిన మహానుభావుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు.




