ప్రాంతీయం

సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే నా లక్ష్యం

60 Views

సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే నా లక్ష్యం: యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాదుల పవన్ కుమార్

సిద్దిపేట జిల్లా డిసెంబర్ 6

యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో సిద్దిపేట యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గా ఎన్నికైన సాదుల పవన్ కుమార్ ను జిల్లా పార్టీ క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరి కృష్ణ సన్మానించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలలొ గెలిచినా నాయకులకు అభినందించారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ నవ భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, కాంగ్రెస్ పార్టీలో యువత ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ పటిష్టం చేయాలనీ గౌరవనీయులు రాజీవ్ గాంధీ భావిస్తున్నారని తెలిపారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించడం, ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరించడతో యువత కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తోందన్నారు. 

ఎన్నికల సమయంలో రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులు, యువతకు ఉపాధి మార్గాలు కల్పిస్తున్నారని, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తూ.. షెడ్యూల్ ప్రకారం నియామకాలను చేపడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పవన్ కుమార్ అన్నారు. నాయకులకే కాకుండా కార్యకర్తలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం గౌరవంగా ఉందనీ, స్థానిక నాయకులు కూడా తనకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

అంతకు ముందుకు సిద్దిపేట యువజన కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ పని చేశాననీ, పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే తన లక్ష్యమని పవన్ కుమార్ తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్