మంచిర్యాల జిల్లా.
*8 మందికి వారం రోజులు జైలు శిక్ష మరియు 10 మందికి ట్రాఫిక్ విధులు నిర్వహించాలని మందుబాబులకు శిక్ష*
ఇటివల మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిని ఈ రోజు అనగా 06.12.2024 రోజున కోర్ట్ లో హాజరుపర్చగా ll Addl JFCM కె. నిరోషా గారు 8 మందికి వారం రోజులు జైలు శిక్ష మరియు 10 మందికి ట్రాఫిక్ విధులు నిర్వహించాల్సిందిగా శిక్షా విధించారు. కావునా వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాల్సిందిగా సూచించనైనది.
ఇది విషయాన్ని బి. సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మంచిర్యాల వారు తెలియజేశారు.





