సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని రాయపోల్ మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుందని బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, పిల్లలు బడికి, పెద్దలు పనికి వెళ్లాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తూ ఆటపాటలతో విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతుందన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఐకెపి సీసీలు కిష్టయ్య, రవీందర్, రాజేశ్వరరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనురాధ, బ్లాక్ కోఆర్డినేటర్ కిరణ్, అంగన్వాడీ టీచర్లు ఆగమ్మ, రేఖ, పద్మ, సంతోష, ఆశ వర్కర్లు యాదమ్మ, భాగ్య లక్ష్మి, రజిత, గర్భిణీ, బాలింత మహిళలు తదితరులు పాల్గొన్నారు.




