ప్రాంతీయం

స్నేహితుని కుటుంబానికి బియ్యం అందజేత

59 Views

అనారోగ్యంతో బాధపడుతూ ఎర్రోళ్ల పుల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులు మాట్లాడుతూ తోగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరం అని, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడ్డారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయకాంత్, సంపత్, ప్రశాంత్, నరేష్, ఆంజనేయులు, భాస్కర్, గణేష్, శీను తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7