మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం.
ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరూ గ్యరంటీలలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని అన్నారు. ఒక్క మంచిర్యాల ఆర్టీసీ డిపో 8 కోట్ల లాభాలను ఆర్థించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలు చేర్చడంలో కృషి చేస్తున్నారని వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలు ఆర్థికంగా లాభపడితేనే కుటుంబాలు బాగుంటాయని దానిని నిజం చేసింది ఆర్టీసీ కార్మికులైనని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంలో కోటి 30 లక్షల మంది మహిళలు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని త్వరలోనే వారికి జీతాలు పెంచి వచ్చిన లాభాల్లో వాటా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మికుల సమస్యలు, ఇళ్ల స్థలాల విషయం తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రయాణికుల రద్దీ దృశ్య మంచిర్యాల బస్టాండ్ ను విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, మెకానికులు తదితరులు పాల్గొన్నారు.
