ప్రాంతీయం

ఘనంగా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు…

104 Views

ముస్తాబాద్, నవంబర్ 28 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు, మహిళల విద్యాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఫూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు.తన భార్య సావిత్రిభాయి ఫూలేకి విద్యనేర్పించి భారత దేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలిని చేసి విద్యాలయాలను స్థాపించి శూద్రులకు బడుగు బలహీనర్గాలకు విద్యనేర్పిన మహాత్ముడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్