ప్రాంతీయం

రేపే బి ఆర్ ఎస్ పార్టీ దీక్ష దివాస్ కార్యక్రమం

63 Views

రేపు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం.

సమైక్య రాష్ట్ర సంకెళ్లను తెంచి, తల్లి తెలంగాణ విముక్తి కోసం ఆమరణ దీక్షతో ఉద్యమ నేత కేసీఆర్  చరిత్రను మలుపు తిప్పిన రోజు న‌వంబ‌ర్ 29, 2009 స్వ‌రాష్ట్ర క‌ల సాకారానికి పునాది వేసిన రోజు “దీక్షా దివస్” పురస్కరించుకొని రేపు, తేదీ 29.11.24 శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను మరొక్కసారి యాది చేసుకుంటూ దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించబడును.

ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు & ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గారు, మంచిర్యాల మాజీ శాసనసభ్యులు  నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య  పాల్గొననున్నారు.

కావున ఈ కార్యక్రమాలకు జిల్లా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పాత్రికేయ మిత్రులు పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్