ప్రాంతీయం

నూతన అధ్యక్షులు

68 Views

గోవర్ధనగిరి పాలకేంద్ర నూతన అధ్యక్షులుగా కోల రాజయ్య…

కరీంనగర్ జూన్ 16

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఆదివారం రోజున కరీంనగర్ పాల కేంద్రం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర నూతన అధ్యక్షుని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రాజయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో తన అప్పగించే బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని రానున్న రోజుల్లో పాలకేంద్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తన నియామకానికి సహకరించిన సభ్యులకు డైరెక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరీ సూపర్వైజర్ ఆంజనేయులు, పాలకేంద్రం డైరెక్టర్లు ఇసంపల్లి బాలయ్య, శ్రీకాంత్, వెంకటరెడ్డి, బొల్లి మల్లయ్య, ఇందిరాల రవి, ఖమ్మం సాది,చంద్రారెడ్డి, బాలయ్య, లక్ష్మారెడ్డి, కార్యదర్శి అల్లరి రవి, టెస్టర్ కంకటి రాకేష్, అఖిల్, సభ్యులు ఇసంపల్లి రాజు, రవీందర్, మల్లయ్య, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్