ప్రాంతీయం

మానవత్వాన్ని చాటుకున్న మర్కుక్ ప్రజాప్రతినిధులు

114 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు మంగళవారం నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన హజీమియా డ్రైవర్ గా పనిచేస్తూ ఇటీవల అకాల మరణం పొందడంతో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయాన్ని వార్తాపత్రికలో ” ఆదుకోండి సారు” అని కథానిక ప్రచురించారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ద్వారా సహకారం అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మర్కుక్ మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణం స్పందిస్తూ వారికి అండగా నిలుస్తున్న మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులను పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప మల్లేశం, సింగం ఆంజనేయులు, ప్రభాకర్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7