ప్రాంతీయం

ఎన్ని సమస్యలున్నా దున్నపోతుమీద వర్షం పడ్డట్లుగా…

264 Views

ముస్తాబాద్/అక్టోబర్/30; సంతలకు ప్రత్యేక స్థలాలేవీ సారూ…! రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒకప్పుడు వారసంత ఎలా ఉంటుందో తెలియని ప్రజలు ఇప్పుడు  ముస్తాబాదులో సంత తిరుణాలవలే  సంతలే సకల మానవ జీవన మనుగడకు ఎంతో ముఖ్యమైనదిగా మారినది. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్నిరకాల సూపర్ మార్కెట్లు తెచ్చినా, హోమ్ డెలివరీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ పల్లెల్లో నడిచే  సంతలకు వన్నెతగ్గలేదంటే అతిశయోక్తి కాదేమో. మండలాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సంతలు నిర్వహిస్తారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న  సంతలకు ప్రత్యేకమైన స్థలాలు, మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రోడ్ల వెంట, వీధుల వెంట నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్డుకు ఓవైపు సంత నిర్వహిస్తున్న మరోవైపు వాహనదారులకు అంతరాయం ఏర్పడుతుందని ముందస్తు హెచ్చరిక బోర్డు లేకపోవడం డివైడర్ కు ఓసైడు సంత మరో సైడు రోడ్డుకు ఆనుకొని వ్యాపార సముదాయాలు, రాకపోకలు ఒకే సైడ్ ఉండడంచేత ప్రయాణాలకు ఆటంకం జరుగుతుందని సంత నిర్వాహకులు ముస్తాబాద్ కు వేరువేరు గ్రామాల నుండి వచ్చేవారికి మరుగుదొడ్లు జాడ తెలవక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడే మూత్ర మల విసర్జన చేస్తున్నారు. ముస్తాబాద్ లో లేక లేక దేవాలయం రోడ్డున పక్కన మూత్రసాలు కడితే పాత్రికేయులు పత్రికలలో ఎన్నోసార్లు ప్రచురించిన తర్వాత చూసి చూడనట్టు వదిలేసుకుంటూ ఖాళీ సమయం దొరికినప్పుడే సంవత్సరానికి ఒక్కసారీ  బయట సోంపు లోపల కంపు డోర్ లేని నిరుపయోగంగా ఉన్న మూత్రశాలలను క్లీన్ చేస్తున్నారని దీని ద్వారా దోమలు దుర్గంధమైన వాసన వెధజల్లుతుందని బాటసారులు పడుతున్న ఇక్కట్లు గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు ముస్తాబాద్ లోనే రాకపోకల ఇబ్బందులు పెంట తవ్వితే ఎన్నో తలెత్తే  సమస్యలు.. ఇకపోతే అంగట్లో  ఈ అంతరాయం ఏర్పడకుండా సులభంగా వెళ్లే మార్గాలు చూపకుండా గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సంత నిర్వాహకులు, వాహనదారులు మండిపడుతూ ఆరోపించారు. ఇప్పటికైనా పై అధికారులు కింది స్థాయి అధికారులపై చర్య తీసుకుని సమస్యలు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7