ప్రాంతీయం

జ్యోతిరావు పూలే ఘనంగా వర్ధంతి…

108 Views

 

*బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళి*
*-కంచర్ల రవి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్*

ముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28,  బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ వారిని కలిసి  అనంతరం రవి గౌడ్ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే  స్త్రీల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తిని బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసి సావిత్రి పులే విద్యను అందించి స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టి స్త్రీల అభ్యున్నతికి పాటుపడాలని గుర్తు చేశారు జ్యోతిరావు పూలే సావిత్రి పులే కి విద్యను నేర్పించి అనేకమైన పాఠశాల ఏర్పాటుచేసి ఎంతోమంది నీరక్షరాస్యులను అక్షరాస్యులుగా మర్చరారని అన్నారు.జ్యోతిరావు సనాతన బ్రాహ్మణులు మరియు ఇతర అగ్రవర్ణాలపై దాడి చేసి వారిని “కపటవాదులు”గా అభివర్ణించారు. అతను అగ్రవర్ణ ప్రజల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ బిసి, ఎస్సీ ఎస్టీ లకోసం పోరాడారని అన్నారు. యువ వితంతువుల కోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించి, చివరికి వితంతు పునర్వివాహ ఆలోచనకు న్యాయవాదిగా మరాడఅని అన్నారు.ఈ కార్యక్రమం లో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, సిరిసిల్ల మండల అధ్యక్షులు మట్టే నరేష్, రుద్రవేని సుజిత్ కుమార్,కళాశాల ప్రినిస్పల్ ఆంజనేయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు నాయాయకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్