లోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ఉన్న చర్చిలను రంగురంగుల వెలుగులతో అందంగా అలంకరించారు. బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించి, అర్థరాత్రి బాలయేసు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతాయి. పేరుగాంచిన శౌరీపూర్ చర్చిని ప్రత్యేకంగా అలంకరించారు. గురువారం క్రిస్మస్ సందర్భంగా ఫాదర్‌ల చేత ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు .





