సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మోనగారి రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగిందని ప్రజా సంక్షేమ పాలన అందించిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ కే సాధ్యమని వైఎస్సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని వైఎస్సార్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ జండా ఎగురవేయడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షులు శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి,వహీద్, తిరుపతి, జఖీర్, జహంగీర్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.




