అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం స్త్రీల విద్య అభివృద్ధి కోసం మూఢనమ్మకాల రూపకల్పన అవినీతి అన్యాయం నిర్మూలనపై జీవితాంతం పోరాటం చేసిన సంఘ సంస్కర్త భావితరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు స్వామి అన్నారు. సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సేవాసమితి ఆధ్వర్యంలో రాయపోల్ మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు స్వామి మాట్లాడుతూ భారత దేశంలో గౌతమ బుద్దిడి తరువాత మొట్ట మొదటగా అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించి, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన బహుజన ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావులకు గురువుగా నిలిచిన మోహోన్నతుడు, కుల, మత, లింగ, వర్గ బేధాలు లేకుండా అందరికీ విద్య అందించాలనే గొప్ప సంకల్పానికి దంపతులిద్దరూ మరణం వరకు పోరాడిన యోధులు పూలే అన్నారు. భారత దేశ మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రి బాయ్ పూలే దంపతులిద్దరు దళిత బహుజనుల చైతన్యం కోసం ముఖ్యంగా మహిళల చైతన్యం కోసం అగ్రవర్ణాల నుండి ఎన్నో అవమానాలను జీవితాంతం పోరాటం చేసిన చైతన్య మూర్తులు అన్నారు. నేటి సమాజం వారిని ఆదర్శంగా తీసుకొని వారిి ఆశయాల సాధన కోసం కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి సభ్యులు రాజు, బాలకృష్ణ, రాంపల్లి స్వామి, నాగరాజు, శివ కుమార్, వినయ్ కుమార్, నర్సింలు, భాను ప్రసాద్, కనకయ్య, స్వామి, శ్రీనివాస్, బన్నీ, చింటూ తదితరులు పాల్గొన్నారు.




