ప్రాంతీయం

కరాటే విద్యార్థులకు సన్మానం. దుబ్బాక సీఐ శ్రీనివాస్

65 Views

నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల జాతీయస్థాయి మూడవ కరాటే, కుంగ్ పూ ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక మండలంలోని గాయత్రి వివేకానంద పాఠశాల విద్యార్థులు పాల్గొని రెండు బంగారు పథకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో తలారి నిశాల్, కోన మనశ్విన్ లకు స్వీట్లు తినిపించి సీఐ శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. ఈ సంధర్బంగా సీఐ మాట్లాడుతూ మహిళ ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ కరాటే శిక్షణపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికీ శిక్షణ అందించిన యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు, స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ రేపాక భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka