. 25 సంవత్సరాల రామకోటి నిస్వార్థ సేవ అమోఘమని కొనియాడిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి దంపతులకు గురువారం నాడు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు స్వామి వారి శేషవస్త్రాలను అందజేసిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచల ముత్యాల తలంబ్రాలు అందుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమో అన్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి మా వంతు కూడ ఓడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు అందించామన్నారు. తిరిగి ఆ రామకోటి రామరాజు ద్వారానే ముత్యాల తలంబ్రాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరో భక్త రామదాసుగా గుర్తించిన భద్రాచలం దేవస్థానం వారు 100కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి సంస్థకు అందజేయడం అయన రామభక్తికి నిదర్శనం అన్నారు. లక్షల మందికి అందజేయడం మామూలు విషయం కాదన్నారు. రామకోటి రామరాజు గత 25 సంవత్సరాల నుండి చేస్తున్న నిస్వార్ధ రామభక్తి అమోఘం అన్నారు.





