చెట్ల పొదల్లో గుర్తు తెలియని శిశువు ఉందని దుద్దెడా మాజీ సర్పంచ్ మహాదేవ్ మరియు స్థానికులు కలిసి 108 సమాచారం అందించారు, ఘటన సమాచారం తెలుసుకున్న కొండపాక “108”సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ మల్లేష్ హుటాహుటిన ఘటన ప్రాంతానికి వెళ్లి పాపను అంబులెన్సు లోకి తరలించి పాపను పరీక్ష చేసి చూసిన మెడికల్ టెక్నీషియన్ మహేందర్ వెంటనే ‘108’ కాల్ సెంటర్ లో వున్నా డాక్టర్ దుర్గాప్రసాద్ కి సమాచారం అందించి అతడి సలహాలు మరియు సూచనలు పాటిస్తూ పాపకు జాగ్రత్తగా అంబులెన్సు లో ప్రాథమిక చికిత్స అందిస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిలో వున్నా డ్యూటీ డాక్టర్ గ్రీష్మ మరియు ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో పాపను సురక్షితంగా అప్పగించటం జరిగింది.
