వ్యాపారుల పై కక్ష సాధింపుతోనే మంచిర్యాల పట్టణంలో కూల్చివేతలు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
*మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా నుండి మార్కెట్ రోడ్ వైపు మున్సిపల్ అధికారులు ఎలాంటి టెండర్ లేకుండా డీపీఆర్ సిద్ధం అవకముందే బడ్జెట్ కేటాయింవకూడానే డ్రైనేజ్ నిర్మాణం కోసం కందకం తవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి బిజెపి జిల్లా కార్యక్రమలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో గత అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యాపారస్తులు ఓటు వేయలేదని ఉద్దేశంతో వ్యాపారస్తుల పై కక్ష తోనే ఉద్దేశపూర్వకంగా వారిని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఇబ్బందిలకు గురి చేస్తున్నారని అన్నారు. గత రెండు నెల నుండి రహదారుల విస్తరణ పేరుతో ఎలాంటి డీపీఆర్ లేకుండా, ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినటు ఎమ్మెల్యే నే ఒక్క ఇంజనీర్ లాగా వ్యవహరిస్తూ స్వయంగా ప్రతి షాప్ ఎంత మేరకు కూలగొట్టలో చెప్పడం కక్ష సాధింపు చర్య అని అన్నారు. అక్రమ కట్టడాలకు బిజెపి కూడా వ్యతిరేకం అని కానీ అభివృద్ధి రోడ్డు విస్తరణ పేరుతో ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని ఎలాంటి చర్యలు చేపట్టడం సరికాదు అని అన్నారు. మంచిర్యాల పట్టణంలో డంపింగ్ యార్డు, హిందూ స్మశాన వాటిక, రైల్వే ఓవర్ బ్రిడ్జి మరియు గోదావరి పై వంతెన లాంటి అనేక ప్రధాన సమస్యలు ఉన్న అవి పట్టించుకోవడం లేదని అన్నారు. మార్కెట్ రోడ్ లో ఒక్కరు ఇళ్లు కూలగొట్టకుండా హై కోర్ట్ నుండి స్టే తెచ్చుకుంటే వారి ఇంటి ముందు రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు భారీ కందకాన్ని తవ్వి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎలాంటి టెండర్ లేకుండా డ్రైనేజ్ నిర్మాణం కోసం కందకం తవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంచిర్యాల అభివృద్ధికి బీజేపీ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని కానీ ఒక్క ప్రణాళిక తో ఆస్తి నష్టపోతున్న అందరితో చర్చించి నిర్మాణం తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, గుండా ప్రభాకర్, గడ్డం స్వామి రెడ్డి, బింగి ప్రవీణ్, చిలుముల శ్రీకృష్ణ దేవరాయలు, మేరేడికొండ శ్రీనివాస్, కాశెట్టి నాగేశ్వర్ రావు, రాకేష్ రెన్వా, ముదాం మల్లేష్, పచ్చ స్వప్న రాణి, దుర్గా ప్రసాద్, గాజుల ప్రభాకర్, చిరంజీవి, పవన్, రాజమౌళి, శివ, తరుణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
