92 Views
ముస్తాబాద్, సెప్టెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవుల జంట ఆలయాల ఆలయ కమిటీ నూతన పాలకవర్గం ఏర్పాటయింది. ఆలయ సేవకులుగా చేరిన 45 మంది సభ్యులు, బరిలో ఉన్న ఎలుసాని దేవయ్య యాదవ్ కు నాటకీయ పరిణామాల మధ్య స్వల్ప ఆధిక్యతతో ఎన్నుకున్నారు. ఆయన మూడోసా
రి ఎంపికవడం విశేషంమైన ఆదరణ లభించడం పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వాహనకు నిధుల సమీకరణలో భాగంగా టపాకాయల వేలంపాటలు నిర్వహించారు. దీంతో టపాకాయల ద్వారా 84 వేల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా ఏటేటా టపాకాయల వేలంపాటను నిర్వహించడంవల్ల అత్యధిక ధరలభారం పడుతున్నదని, నాణ్యతలేని టపాకాయలను అత్యధిక ధరలకు కొనవలసి వస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
No Slide Found In Slider.
Poll not found