ప్రాంతీయం

సూపర్వైజర్లుగా అంగన్‌వాడీ కార్యకర్తల ఎంపిక

136 Views


దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండలం నుండి ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు గా ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరి 2 తేదీన అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ గా ఎంపిక చేయడం కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించారు. మెరిట్ ఆధారంగా మండల పరిధిలోని గాజులపల్లికి చెందిన శ్యామల, అహ్మద్ నగర్ చెందిన షేక్ మెహతాబ్ బేగం సూపర్వైజర్లు గా ఎంపిక చేశారు. వీరు ఆప్షన్ ఎంచుకోవడం కోసం ఆదివారం హైదరాబాద్‌లోని స్త్రీ శిశు సంక్షేమ భవన్‌కు వెళ్లారు.

No Slide Found In Slider.

Poll not found