ప్రాంతీయం

అక్రమదారులను అడ్డుకొని చర్యలు తీసుకోవాలి…

17 Views

ముస్తాబాద్, జూలై17(24/7న్యూస్ ప్రతినిధి):  నావాపురం శివారులోని గూడూరు గుట్టలను అక్రమంగా ఆక్రమించి, పర్యావరణానికి తీవ్రనష్టం కలిగిస్తున్నారని మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి గుంటి వేణు మరికొందరు మండలంలోని తాహసిల్దార్ ఎంఎ షారుక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుంటి వేణు మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు గుట్టలను ఆక్రమించి మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసినట్లుగా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే కుట్రలకు పూనుకున్నారని దీనివల్ల వర్షాలు పడక భూగర్భ జలాలు తగ్గుతాయని, చెరువులు కుంటలు పూర్తిగా అడుగంటుతయని గుట్టలపైనున్న అరుదైన వనమూలికలు జీవరాసులు కనుమరుగయ్యేటువంటి సమస్యలు తలెత్తే ప్రభావం ఉంటుందన్నారు. మనఊరి గుట్టలను ఆక్రమించడంవల్ల మనకే కాదు మన భవిష్యత్ తరాలకు తీవ్రనష్టం జరిగే అవకాశం ఉందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *