ముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి); ఆవునూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మండెపెళ్లి ఎల్లవ్వ రాములు దంపతులకు కనీసం గూడు కూడాలేని దీనపరిస్థితి అయినా తన కుమార్తె వివాహం ఉన్నదని తెలియడంతో ముస్తాబాద్ వాస్తవ్యులు రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి తనవంతుగా వధువు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కణమేని శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు వేణు, బండి శ్రీకాంత్, సద్ది మధు తదితరులు పాల్గొన్నారు.
