ప్రాంతీయం

క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి – రామగుండం సి పి

38 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*బెటాలియన్ లో దర్బార్‌ ..సిబ్బంది సమస్యలు తెలుసుకొన్న రామగుండం సీపీ*

*క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్‌ శాఖ ప్రతిష్ఠను పెంచేలా పని చేయాలి: పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,*

గౌరవ డిజిపి మరియు అడిషనల్ డీజీపీ బెటాలియన్స్ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ  మంచిర్యాల గుడి పేటలోని 13వ టి జి ఎస్ పి బెటాలియన్ లో సిబ్బంది తో బెటాలియన్ కమాండెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్బార్‌ కు హాజరై సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

సీపీ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ, ఉన్నత అధికారులు సిబ్బంది కోసం చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అని తెలిపారు. యూనిఫాం సర్వీ్‌సలో ఉండి నిరసనలు చేయవద్దని క్రమశిక్షణ కలిగి పోలీస్ శాఖ లో పనిచేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయని, గతంలో లాగానే టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధి విధానాలు అమలు జరిగినట్లుగానే తెలంగాణలోనూ ప్రస్తుతం కొనసాగుతున్నాయని అన్నారు. మీమీ సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న ‘దర్బార్‌’ కార్యక్రమం ద్వారా వారి అధికారులకు/కమాండెంట్లకు/అడిషనల్‌ డీజీపీ కి తెలపాలని సూచించారు. క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్‌ శాఖ ప్రతిష్ఠను పెంచేలా చేయాల్సిన సిబ్బంది.. పోలీస్‌ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదని కోరారు.

సిపి కి సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు, టీజీఎస్పీ డ్యూటీ వల్ల ఎదుర్కొంటున్న వివిధ రకాల ఇబ్బందుల గురించి తెలపడం జరిగింది. దీనికి సీపీ సానుకూలంగా స్పందిస్తూ సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల యొక్క వివిధ రకాల వినతులను రిపోర్టు రూపంలో ఉన్నతాధికారులకు పంపుతానని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం నందు బెటాలియన్ కమాండెంట్ శ్రీ పి వెంకట రాములు మరియు బెటాలియన్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు హాజరు కావడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్