కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం పుస్తకాల పంపిణీ చేసిన మర్కూక్ సర్పంచ్
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, బిఆర్ఎస్ నాయకులు మల్లేశ్ ముదిరాజ్, ప్రిన్సిపాల్ లక్ష్మీ గార్ల చేతుల మీదగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే సంక్షేమ పథకాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది అని, ప్రతి విద్యార్థి ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి అని అన్నారు. ప్రతి విద్యార్థి కలలు కనాలని, వారి కలలను సాకారం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తోంది అని, బాగా చదివి కుటుంబంతో పాటు ప్రభుత్వానికి, సమాజంలో కూడా మంచి పేరు, గౌరవం తెచ్చుకోవాలి తెలియజేశారు. ప్రాథమిక స్థాయిలో బోర్డింగ్ సదుపాయాలతో నివాస పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన విద్య సాధ్యమయ్యేలా మరియు సమాజంలోని వెనుకబడిన బాలికల అందరికీ అందుబాటులో ఉండేలా కస్తూర్భా బాలికల విద్యాలయాలు ఏర్పాటును పేద విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలి అని, మంచి చదువుకొని మంచి ఫలితాలు సాధించి, తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించి, రాష్ట్రం గర్వపడేలా ముందడుగు వేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు ఉన్నారు
