అక్టోబర్ 05 మంచిర్యాల జిల్లా
11 వందల రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
షూ కొనుకునేందుకు తల్లి ఇచ్చిన 11 వందల రూపాయలు కనబడక పోవడంతో తోటీ విద్యార్థులను నిలదీశాడు
దీంతో తోటీ విద్యార్థులు దాడికి దిగారు.
నువ్వే మా డబ్బులు చోరీ చేశావంటూ ఆరోపిస్తూ సదరు విద్యార్థిపై ఆరుగురు విద్యార్థులు మూకుమ్మడి దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరువు పోయిందనే మనోవేదనతో అదే ఆసుపత్రిలో గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో గురువారం చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా నెన్నల మండలంకు చెందిన కామెర ప్రభాస్ (19) అనే యువకుడు మందమర్రి మండలం పొన్నారం గ్రామం ఎస్సీ హాస్టల్ లో ఉంటూ సివి రామన్ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు.
మూడు రోజుల క్రితం తన డబ్బులు పోయాయంటూ తోటీ విద్యార్థులను నిలదీశాడు ప్రభాస్. దీంతో రెచ్చిపోయిన తోటీ విద్యార్థులు ప్రభాస్‌తో గొడవకు దిగారు. నీ డబ్బులు కాదు అసలు మా డబ్బులే నువ్వు దొంగతనం చేశావంటూ ఆరోపిస్తూ ఆ డబ్బులు ఇవ్వాలంటూ మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.
దీంతో ప్రభాస్ మెడపై చాతిలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన హాస్టల్ సిబ్బంది. హుటాహుటిన ప్రభాష్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మనస్థాపానికి గురైన ప్రభాస్ గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.
చికిత్స అందించినా ప్రభాస్ గురువారం ప్రాణాలు కోల్పోయాడు . దీంతో ప్రభాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
