ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్ లో గ్యార్మి జెండా పండుగ

156 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*కమిషనరేట్ లో ఘనంగా గ్యార్మీ (జెండా) పండుగ*

*పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన రామగుండం సిపి .*

*ఐకమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండగ: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గ్యార్మీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెడ్ క్వార్టర్స్ లో గ్యార్మీ పండుగ వేడుకలు కోలాహలంగా జరిగాయి. గ్యార్మీ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి పోలీస్ కమీషనర్ , పోలీస్ అధికారులు ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. ప్రతి ఏటా గ్యార్మీ పండుగను ముస్లిం సోదరులు ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్‌ ప్రవక్త సూచించిన మార్గంలో నడుచుకోవాలని, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. గోదావరిఖని 5 ఇంక్లైన్ లోని మదర్స లో ఉండే పిల్లలకు సిపి బట్టలను అందచేసారు.

కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు ,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, రామగుండం ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, ఆర్ ఐ లు దామోదర్,మల్లేశం,శ్రీనివాస్,సంపత్, సిఐ లు,ఇన్స్పెక్టర్స్ ,వివిధ వింగ్స్ లోని ఎస్ఐ లు సిబ్బంది ,ఎఆర్ సిబ్బంది,స్పెసిఅపాల్ పార్టీ ,హోం గార్డ్స్ , ముస్లిం మతపెద్దలు , సోదరులు పాల్గొనారు

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్