ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఫ్రెండ్స్ యూత్…

41 Views
  ముస్తాబాద్, అక్టోబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఇటీవల మరణించిన మెంగని సత్యనారాయణ అనేవ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి తమవంతు సహాయంగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబానికి చేయూతను అందించాలని ఫ్రెండ్స్ యూత్ తరపున కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ విద్యుత్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ధీటి ప్రవీణ్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్