గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్బంగా అయన చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వరాజ్యం నా జన్మదిన హక్కు అనే నినాదంతో ప్రతి భారతీయుడిలో స్వతంత్ర కాంక్షను రగిలించారు. జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అన్నారు. అయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు.
