ముస్తాబాద్, అక్టోబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి): జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైలస్తుతే’ సర్వమంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమిని శనివారం పండుగకు నిర్వహించేందుకు ఉమ్మడిజిల్లా ప్రజలు సన్నద్ధమయ్యారు. ఈరోజు శమీ వృక్షానికి పూజలు చేసిన అనంతరం ప్రజలు పాలపిట్టను దర్శించుకోన్నారు. అలాగే మరిన్ని చోట్ల భారీగా రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇప్పటికే ప్రతిఇల్లు పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. గ్రామమంతా సందడిగా మారాయి. భారతదేశం పండుగలకు పుట్టినిల్లు. మన సంస్కృతిలో ప్రతి సందర్భాన్ని ఓ పండగలా చేసుకోవడం ఆనవాయితీ. భారతీయ పండుగలకు, మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. మతాలతో సంబంధం లేకుండా పండుగలు కుటుంబాల మధ్య, మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేస్తున్నాయి. నేటి తరం పండుగలు అంటే ఆచారాలు మాత్రమే అనుకుంటుంది. దాని వెనుక ఉన్న మానసిక ప్రయోజనాలను గుర్తించలేక పోతోంది. పండుగలు అంటే కేవలం ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసే సందర్భం సరదాగా సంతోషంగా గడిపే సమయం బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళినవారు పండగ సందర్భాల్లో సొంత ఊరు చేరుకొని బంధువులు, స్నేహితులతో గడపడం ద్వారా వారిలో సానుకూల ఉద్వేగాలు పెంపొందుతాయి. ఒకరికి ఒకరు బంగారం పంచుకొని (జంబి) ఆలింగనం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలని శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. పండుగ అంటేనే మానసిక ఉద్వేగాల సమాహారం. బంధువులను, చిన్ననాటి స్నేహితులను కలిసిన ఆనందం, సరదాగా కబురు చెప్పుకుంటూ తుళ్ళిపడే ఉత్సాహం, పండుగ తర్వాత వీరందరినీ విడిచి వెళుతున్నప్పుడు కలిగే కొద్దిపాటి వేదన. ఇలా అన్ని ఉద్వేగాలను పరిచయం చేస్తుంది, భావోద్వేగాలను పరిపుష్టం చేస్తుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని చిన్ననాటి మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై ఏళ్లరామ్ రెడ్డి, సంతోష్ రావు, ఎద్దండి నరసింహారెడ్డి, చెవుల మల్లేశం, గుర్రాల రాజిరెడ్డి, పల్లె సత్యంగౌడ్, జనగామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
