ప్రాంతీయం

ఆకతాయిల భరతం పడతాం. – అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు  – మఫ్టీలో పోలీసుల నిఘా  – ముస్తాబాద్ ఎస్సై గణేష్ …

263 Views
 ముస్తాబాద్: అక్టోబర్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): బతుకమ్మ నేపథ్యంలో ఎవరైనా ఆకతాయిలు మహిళలు, యువతులు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారి భరతం పడతామని ముస్తాబాద్ ఎస్సై గణేష్ హెచ్చరించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెర్రుమద్ది గ్రామంతో పాటు పాలు గ్రామాల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మ ఆడుకునే ప్రదేశాల వద్ద ఎవరైనా బిగ్గరగా హారన్ కొడుతూ రాష్ డ్రైవింగ్ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలకు, యువతులకు, బాలికలకు ఆకతాయిల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు మఫ్టీలో ఉంటారని తెలిపారు. ఎవరైనా వెకిలి చేష్టలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు గురిచేసిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తదుపరి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7