రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోఇటీవల నరికిన టేకు చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హోటల్లో ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ అమ్మడం పట్ల వారికి ఇంతవరకు నోటీసులు అందడం లేదని ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మండల ఈవో పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు వినతిని నివేదిస్తామని అంటున్నారు.
